Saturday, 24 June 2023

భీమవరం మిత్ర బృందం

 మిత్ర బృందం మిళితమై మధుర మిత భాషణాలతో,

అలరించిరి  గాన పద్య కవితా అమృతములతో,

సంతసించిరి దంపతులు గడిపిన  సమయము,

ఉల్లాసము మిగిల్చినది మిత్రులకు పరిపూర్ణ తృప్తిగా....

 భీమవరంన పుట్టి భీమేశ్వరుని కటాక్షం పొంది,

భీమవరం స్కూల్ మిత్రులై విద్య నభ్యసించి,

జీవితం గడిపితిమి ఉన్నతముగా, సర్వ శుభములుగా,

నేడు ఏమి సుదినం బాల్య మిత్రులు వృధ్ధ మిత్రులుగా

కలిసితిమి మధుర  జ్ఞాపకాలను విరబోయుటకు.....

Thursday, 16 June 2022

 *పెద్ద లోపం*

*ఒకసారి మనిషి కోకిలతో అన్నాడు...

*నువ్వు నల్లగా లేకపోతే ఎంత బాగుండేది*

సముద్రంతో అన్నాడు...

*నువ్వు ఉప్పగా లేకపోతే ఎంత బాగుండేది*

గులాబీతో అన్నాడు...

*నీకు ఇలా ముళ్ళు లేకపోతే ఎంత బాగుండేది*

అప్పుడు... ఆ ముగ్గురు మూకుమ్మడిగా ఇలా అన్నారట...

*ఓ మనిషి నీలో ఇలా ఇతరులలో లోపాలు వెతికే గుణం లేకపోతే నువ్వు ఇంకెంత అద్భుతంగా ఉండే వాడివో కదా!**(మనిషికి అదే పెద్ద లోపం)*

Tuesday, 3 May 2022

                     శ్రీ   శంకర జయంతి

ఆది శంకరవై వెలిసిన ఓ శంకరా,

జ్ఞానజ్యోతిని వెలిగించి జ్ఞానమును ఒసగితివి ఈ లోకమునకు,

మానవాళికి ముక్తిమార్గము చూపితివి అలనాడు,

ధన్యులు మైతిమి నేడు ఓ శంకరా,

సదా మీ స్మరణమే కదా మాకు జీవనము ఓ శంకరా....

Thursday, 3 March 2022

 అమరావతి

అమరావతి నాయక అమరలింగేశ్వర స్వామి,

కష్ట జీవుల ఆంధ్రుల విన్నపము విని కరుణించితివా,

అబలల అలసి, సొలసిన మొర ఆలకించితివా,

శంకరా సదా మమ్ములను లాలించి, పాలించి, కాపాడువయ్యా శివా.....

Thursday, 15 July 2021

                           మనస్సు

కనులకు కానరాని మనస్సు,

దోబూచు దోబూచు లాడుచు దోచుకొనుమనస్సు,

విరహ విహారముతో విహరించు  వేధించు మనస్సు,

వీడును క్షణకాలములో వింతగాను....

 గుండు గుండ్రముగా ఉండు గోకునకు,

పట్టుకుందామన్న రాదు, పట్టులేదు,

నిలవమన్నా లేదు నీరు నీరు,

ఇచ్చునయ్యా హాయ్, ఆ ప్రాణికి ప్రాణికీ....