Padaanjali ( రా మ)
Saturday, 26 September 2015
Saaraa Saaraa
సారా సారా
సారా, ఏమమ్మ, మా మానవసారమంతా పీల్చి పీల్చి,
కల్తీసార, కల్తీసారయనుచు, కనులు మూయుచుంటివి,
ఈ మానవులను సారవంతముగా చేయక, సారావంతముగా చేయుచున్నావు,
సారాలేని జీవితము, నిరర్ధకమని భావించితివా సారా ఓ సారా !!!!
Tuesday, 22 September 2015
Chandamamaa
చందమామ
చందమామ, ఓ భామ, ఏమి నీ అందమేమమ్మ
నీ చల్లని చూపులుతో మా తనువులు చల్లబడే,
నీ వెన్నల దీవనలు, సదా మనసులు ఉరకలువేసి,
మనసులు కరిగించి, మమతలు కలిగించి,
మనుషులను ఒక్కటిగాచేసి, గిలిగింతలు జేసితివి,
ఏమ్మమ్మ, మామా, చందమామా, ఓ చందమామ.....
Wednesday, 16 September 2015
Anubhutulu
అనుభూతులు
శ్రీవారి స్తోత్రములు శ్రీమతికి ఘాటుకలుగగా,
శ్రీమతి నామములు శ్రీపతికి చేదుకలుగగా,
చిన్నారి ముద్దు చేష్టలు, ఇంట పిడుగులుగా పడ,
జీవిత సత్యమే ఇంతయని తెలిసే, జగత్ నాయకుడికి.......
Saturday, 5 September 2015
Krishna Krishna
కృష్ణా కృష్ణా
కృష్ణా కృష్ణా యని కృష్ణా అష్టమి నాడు అవతరించితివి
ఎంత నీ నామము చేయ తృష్ణ తీరకపోయే
రాధ, నిన్ను కృష్ణా కృష్ణా యని పరితపించి రాధాకృష్ణలుగా ఖ్యాతిగాంచితిరి,
కృష్ణా కృష్ణా యని తలచినంతనే నీవు అభయముఒసంగితివి
జన్మ జన్మలకు నీ నామమే సదా శరణము మాకు
నీ ఒక్క నామముతో మమ్ములను తరింపచేసితివి
నిన్ను కృష్ణా కృష్ణాయని తలచినంతనే కల్గు సర్వ శుభములు ..........
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)