Monday 5 November 2018


                                        మానవ జన్మ

సముద్రము ఎంత ఉన్న ,  సార్ధకము లేదు
గంగ ఎంత అయన,  గళము తడుపు
మనిషి ఎంత ఉన్న,  మానవ హృదయము లేనిచో
మానవ జన్మ సార్ధకము ఏమి,  మనుజుడా...... 
.               అడవి పండు

అడవి లోన  చెట్లు  అందముగా ఉండు
పలకరింపబోవ  పచ్చగా చూసే
ముద్దుగా  యిచ్చె  ముచ్చటైనా పండు
తినగ  తినగా చూడ , తీపి తీపి మధురములు ..... 

Friday 21 September 2018

4.9.2017 -- 2018 1st year

                                          4.9.2017 .... 1st year

నిత్యమూ నిన్ను తలంపక మరువ మైతిమి ఓ భాస్కరా ,
నీ కిరణములు మసక బారిన, జీవులకు వెలుగు లేదుకదయ్యా ఓ భాస్కరా,
సదా మా హృదయములను నిల్చి ప్రభవించి, ప్రసరించి మాకు జ్యోతినివ్వవయ్య,
ఇవే మా హృదయ పూర్వక వందనములు భక్తితో సమర్పణ .........

సరి లేరు నీకు ఎవ్వరని సాహసించితివి   బాల్యమున ,
భళాయని  భారము మోసితివి  బాగుగాను ,
భేష్ భేష్ యని   ఎల్లరూ మెచ్చితిరి,   గంభీరముగా,
తెలివి ఎవ్వరి సొమ్ముకాదు యని తెలిపిన , తెలుగు తేజ .......