Thursday 24 December 2015

Chandi Yagam

                       చండి యాగము 

చంద్రశేఖర చంద్రశేఖర చక్కనయన ఆయుత  చండియాగము  
సహృదయముతో మనః  కారుకడైన చంద్రడు సంకల్పముచేయ,
లోక  క్షేమార్ధమై  కాంక్షించిన ఈ ఆయుత మహా చండియాగము 
సదా లోకులను కాపాడి ధన్యులను జేయుగాక...... 

Wednesday 16 December 2015

Subrahmanya shasti

             సుబ్రహ్మణ్య షష్టి

మార్గశిర శుద్ధ షష్టి, మా మంచి శుభ దృష్టి
నాగజాతి సేవ, నరులకు కలుగు శుభములు
సుబ్రహ్మణ్యస్వామి పూజలు, తీరు అన్ని దోషములు
పూజించినే కలుగు, సర్వ శుభములు అందరికి.... 

Monday 23 November 2015

Shiva Parvati

                             శివ  పార్వతి

భాద్రపద మాసమున చిన్న గణపయ్యను భక్తితో కొలవ,
ఆశ్వీయుజమున మా  అమ్మ, నవ విధముల పూజింప దర్శనమిచ్చే,
కార్తీకమున మా శివయ్య, కోటి దీపకాంతులతో అభిషేకములతో వెలిగే,
ఏమి భాగ్యమమ్మ ఆ పార్వతి పరమేశ్వరులది ఆ చిన్న బొజ్జ గణపయ్యతో
ఇంతకన్న భాగ్యమేమి కావలెను ఈ భక్త కోటి జనులకు...... 

Monday 26 October 2015

Andhra Hodaa

                  ఆంధ్ర  హోదా 

గల గల పారే  ఓ గోదావరి, కిలకిల లాడుచు ఓ కృష్ణమ్మా,
పెనవేసిన  ఓ పెన్నమ్మ, వంశము లిచ్చు  ఓ వంశధార,
సరితూగు వారు లేరనుచు  ఓ సముద్రుడా,
విజయనగరము నుంచి విజయనగరము వరుకు విజయ వాడలై,
ఇన్ని హంగుల నీ హోదా ఏమమ్మ,
అయినను నీకు ప్రత్యేక  హోదా 
పరిపాలన ప్రత్యేక  హారమే కాదా తల్లి ఓ ఆంధ్ర తల్లి ..... 

Friday 23 October 2015

Amaraavati

             అమరావతి 

అమరావతి   ఓ  అమర లింగేశ్వర 
ఆదుకోవయ్య  ఈ ఆంధ్రులను 
అనార్త  ఆంధ్రులను  ఆమడ దూరము విసిరన 
నీ తెలుగు బిడ్డలను కరుణించి కాపాడవయ్యా.... 

Monday 12 October 2015

Inti Inti sobha

            ఇంటిఇంటిశోభ

ఇంటి ఇంట కొత్త కోడళ్ళ శోభ వెలిగే
కొండంత కొడుకులు కోర్కెలు తీర్చు
అమ్మ నాన్నల ఆనందము  ఆకాసమాయే
ఇంతకన్నా ఏమి భోగమేమి నరుడా..... 

Saturday 26 September 2015

Saaraa Saaraa

             సారా  సారా 

సారా, ఏమమ్మ, మా  మానవసారమంతా పీల్చి పీల్చి,
కల్తీసార, కల్తీసారయనుచు, కనులు మూయుచుంటివి,
ఈ మానవులను సారవంతముగా చేయక, సారావంతముగా చేయుచున్నావు,
సారాలేని జీవితము,  నిరర్ధకమని భావించితివా సారా ఓ సారా !!!!

Tuesday 22 September 2015

Chandamamaa

             చందమామ 

చందమామ, ఓ భామ,  ఏమి నీ అందమేమమ్మ 
నీ చల్లని చూపులుతో మా తనువులు చల్లబడే,
నీ వెన్నల దీవనలు, సదా మనసులు ఉరకలువేసి,
మనసులు కరిగించి, మమతలు కలిగించి, 
మనుషులను ఒక్కటిగాచేసి, గిలిగింతలు జేసితివి,
ఏమ్మమ్మ, మామా, చందమామా, ఓ చందమామ..... 

Wednesday 16 September 2015

Anubhutulu


                                     అనుభూతులు 


శ్రీవారి  స్తోత్రములు  శ్రీమతికి  ఘాటుకలుగగా,
శ్రీమతి  నామములు  శ్రీపతికి  చేదుకలుగగా,
చిన్నారి  ముద్దు చేష్టలు,  ఇంట  పిడుగులుగా పడ,
జీవిత  సత్యమే  ఇంతయని  తెలిసే,  జగత్  నాయకుడికి.......



Saturday 5 September 2015

Krishna Krishna

                    కృష్ణా  కృష్ణా 

కృష్ణా  కృష్ణా  యని  కృష్ణా అష్టమి  నాడు  అవతరించితివి 
ఎంత  నీ  నామము  చేయ  తృష్ణ  తీరకపోయే 
రాధ, నిన్ను  కృష్ణా  కృష్ణా యని పరితపించి  రాధాకృష్ణలుగా  ఖ్యాతిగాంచితిరి,
కృష్ణా  కృష్ణా యని  తలచినంతనే  నీవు  అభయముఒసంగితివి 
జన్మ జన్మలకు నీ  నామమే  సదా శరణము మాకు 
నీ ఒక్క నామముతో మమ్ములను తరింపచేసితివి 
నిన్ను    కృష్ణా  కృష్ణాయని తలచినంతనే  కల్గు సర్వ శుభములు  .......... 

Monday 17 August 2015

Swardhamu

             స్వార్ధము 


స్వార్ధము వీడి నిస్వార్ధమును ఎరిగి
నిజమగు సేవ  నిక్కచ్చిమై వెలుగు
నీ పాద సేవ నిరతము భక్తితో కొలవ
నిలుచు  నిరతము  సదా మదిలోన స్వచ్ఛముగా .....


ప్రకృతి పచ్చదనముతో సెలయేరు పారు  ఉండి,
ఉండి అగ్రహారముగా  ఖ్యాతి నొందే వేద శాస్త్రములతో,
 క్రొత్త క్రొత్త శోభలుతో అలంకరించు కొనుచు ఈనాడు
మెరుపుగా మెరిసే అంద చందములతో చూడముచ్చటగా.....












Sunday 9 August 2015

OM SREEM


           ఓం,  హైం, శ్రీం 

ఓం కారమగు శక్తి ,  హైం, హ్రీంకారముతో గర్జించు,
శ్రీ కారము  యిచ్చు శుభము శుభములతో,
సదా జపించు ఉత్తములకు
నిక్కముగా పొందే నిజమగు కరుణ..

Wednesday 29 July 2015

Vedana

        

        వేదన 

సింగారి  శృంగారమునకు  గారము  చేయ
బంగారి  బంగారమునకు  బలవంతము చేయ
వయ్యారి  వయ్యారము  ఒలక  పోయుచు వంతపాడ
 వెఱ్రి సరసుడునకు  వేదనతో  సాధ్యము కాక చతికలిపడే....

Monday 27 July 2015

Abdul kalam

         అబ్దుల్ కలాం 

అబ్దుల్ కలాంజి, నీకు సలాం సలాం 
నీవు కలాం కాదు,  జీవిత  కలం కలం,
నీవు సరస్వతి కలం,  రాజికీయ కలం,
నీ హృదయము సర్వదా కలం కలం చిన్నారులకు,
నీ ఆదర్శం అందరికి కలం కలం, నీకు గులాం గులాం,
నీ వేదాంతము అందరికి జ్ఞానోదయం,
మీ భారత సేవ, ఎల్లప్పుడూ మరవరానిది,
మీరు సదా అందరికి  మార్గదర్శకులు,
కలాం కలాముజి,  నీకు ఇవే మా సలాం సలాం...... 


Friday 24 July 2015

MANI


                 మణి 

 గృహమునకు  హితమయ్యె మణి  గృహిణిగా
వన్నె తెచ్చే గృహిణి వెన్న వలె
సేద తీర్చు శ్రీ సతిని ఛల్లగాను
సర్వదా పొందే ఖ్యాతి భువిలోన.......


Tuesday 14 July 2015

Puskara bhagyam

              పుష్కర భాగ్యం

పుష్కర భ్యాగ్యమని పరవళ్ళు తొక్కగా
పరమ పావనముతో పరవశించి పవిత్రనొందగా
పరమ పావనులు నారాయణలో ఐక్యమునొంది
మిగిల్చితిరి దుఃఖసాగరము ఈ మనుజులకు....
============================
ఈ పుష్కరములు 12 రోజులు కావున భక్త జనులు
ఆవేశులై  తొందరతో ప్రాణము మీదికి తెచ్చుకోవ్వదని
మనవి. ఈ  స్నానములు ఎప్పుడు చేసిన పుణ్యము అందరికి
సమానముగానే ఉండును అని గ్రహించగలరు అనిమనవి.





Tuesday 30 June 2015

Ushodayam

           ఉషోదయం


ఉషోదయము ఉరకలేస్తు  చల్ల చల్లని గాలి వీచె,
సేద తీరె మనసు, తనువు, చల్లగాను,
రా  రమ్మని  పిలిచే, నిండుగా  పారు పిల్లనది,
తడిసి  నంతనే  తీరు,  శరీరము చల్లగాను,
ఎదుట నిలిచే, ఆదిత్యడు, ఎఱ్ఱని  నిండు బింబముగ,
కదలించు మనసును అర్ఘ్యమునకు,
నిత్య అనుస్టానము, ఇచ్చు మనఃశాంతి,  ఆరోగ్యము, భోగ భాగ్యములు.... 

Wednesday 24 June 2015

అందం

                అందం 

అందము అందమంటివి  ఆకాశమునకు ఎగిరిపోయే 
చందము చల్లగా  చనివిడిముద్ద ఆయె 
అహము వీడె అరికాలికి వచ్చె 
మిగిలిన దేమి, మనకు, మిధ్య మినహా.... 


 

Saturday 20 June 2015

Yoga

                 యోగ 

యోగ చేసిన నవ నాడుల కదిలే,  
కండరములు కదులించు హాయ్ నిచ్చు,
నవరంద్రములు తెరుచు నడక సులభమవ్వు,
జ్ఞానేంద్రములు మేలుకొలుపు , జ్ఞానమును పెంచు,
యోగ మెల్ల జేసె, ఆరోగ్యము భాగ్యమిచ్చే...... 


యోగ చేయరా నరుడా, ఆరోగ్యమును పొందర,
ఆ ఆరోగ్యమే మహాభాగ్యము  అని తెలుసుకొని,
మనసు శాంతి, మనిషికి శాంతిని పొంది,
దేశ శాంతి, ప్రపంచ శాంతిని పొందుదము.... 

                                         రా . మ

Friday 19 June 2015

గోదావరి పుష్కరము

              

ఓ గోదావరి మాత, ఏమి మా భాగ్య మమ్మా,
మమ్ములను తరింపచేయ బూని 
నీ ఒడిలో బాసర ఆడపడుచుగా వెలిసితివి,
రామ పాదములను,  ధర్మ క్షేత్రములను తాకుచు,
కాళేశ్వర కామాక్షివై,  నిండుమనసుతో 
భద్రాచల సీతగా దాటుచు,  వడివడిగా 
నిండుగా దర్సన భాగ్యమిచ్చితివి రాజమహేంద్రవరమున 
నీ తీర్ధ మహిమ ఏమో గాని, ఈ గడ్డ జనులను 
వేద శాస్త్ర పారంగతులుగా జేసితివి, ఈ భూమిని సస్యస్యామములుగా జేసి,
పుష్కర సమయమున సర్వ దేవతలు పునీతులై,
మమ్ములను పునీతులుగా జేసిన, ఈ గోదావరి మాతకు 
నీకివే మా వందనములు...... 


                                             రా . మ 

Friday 12 June 2015

Chita pata chinukulu

         
                        చిట పట చినుకులు

చిట పట చినికులు తయి తక్క లాడుగా
తహ తహ లాడిన తనువు,  సేదతీరగా
కిల కిల పక్షులు గల గల ఎగరగా
వనములోన  పువ్వులు కోరగా వికసించగా
మదిలోన కోరికలు మనసు  విప్పె..

----------------------------------------------

బీటలు వారిన భువి ఉష్ణము కక్కగా
తడిసిన ముద్దతో మరల పచ్చ పంటకు సరియని
ఇచ్చు జనులకు/ప్రాణులకు జీవము
సదా సిరి సంపదులతో  నింపుచు రక్షించు చుండె.....

Thursday 11 June 2015

SWARAMAADHURAMU

                              స్వరమాధురము 

పలుకులోలుకు పలువరసులతో 
గొంతుపలుకు కోకిల గానముగా 
హాయ్ అనిపించు తీపి మధురముగా 
పలకవే స్వరము నిండుగాను..

Wednesday 27 May 2015

KAVITA HRUDAYAMU

                      కవిత హృదయమ 
 పద్య కవితలోలుకు పదముల  సొంపుయై 
పలుకు  సౌరభములుండు   పంచదార  తీగలుగా 
హృదయము  పలుకు   మల్లెమాల  ఇంపుగా 
గుబాళించు  గుబాళించు  కవితా  హృదయమున 
ఆస్వాదించు  భాగ్యము  ఈ  మానవులకే  కదా.... 

Friday 22 May 2015

Bhaanudu

                    భానుడు 

భానుడా  భగ  భగ  మనుచు  నీ  ప్రతాపంబుతో 
భయ  భయ మార్గమున  భీతి చెందె   ప్రాణంబుల్ 
నీ  ప్రతాపంబును తాళలేక  వరుణని కొరకు
వీక్షింప  జనులను, ప్రాణంబులన్,
అలరించి , శాంతించి,  కరుణ జూపవయా 
ఓ  మిత్ర, రవి, సూర్య,భాను, ఖగపూష, మరీచ, హిరణ్యగర్భ,
పద్మినిఛాయ, ఉషాసమేత, శ్రీ  సూర్యనారాయణ,
నీకివే  మా నమస్కారములు. ....


                                                                రా .  మ 

Friday 15 May 2015

TELUPU RANGU

                తెలుపు  రంగు 

తెల్ల  జుట్టువని  తలబిరుసుతో  నెత్తి నెక్కి,
తలమీద  తై  తై  తక  తక లాడు  చుంటివి, 
నీ  తల  బిరుసు  నణచుచు  నిన్ను నల్లగా చేసితిమిగాని,
నీ నిజస్వరూపము   అంతటా ప్రకాశించుచూ,
ఈ  మనుజులను సర్వదా అవహేళన జేసితివి,
నీకిది  న్యాయమా ! 

                                                     రా .   మ 

Monday 27 April 2015

ప్రేమ ప్రేమ

               
                    ప్రేమ ప్రేమ 

అమ్మ   ప్రేమ   అమృతము   ప్రేమ 
నాన్న   ప్రేమ   ఆ ప్యాయత   ప్రేమ 
అన్న    ప్రేమ     ఆనందపు   ప్రేమ 
సోదరి    ప్రేమ    సహృదయ   ప్రేమ 
భార్య    ప్రేమ     జన్మ జన్మల ప్రేమ 
బంధు   ప్రేమ    బహు జన్మల  ప్రేమ 
విత్తము  ప్రేమ    జన్మ సార్ధక  ప్రేమ 
దైవము   ప్రేమ   పరమార్ధసాధక   ప్రేమ 
ప్రేమ   ఎన్నివిధములని   వివరింపదగునే ...... 

Sunday 26 April 2015

kaltee kaltee

                                    కల్తీ కల్తీ
    నిత్యమూ  మనము ఉదయము నుంచి  సాయంత్రము వరుకు 
    ఈ  కల్తీ ప్రపంచమున అందున మన దేశమున  అనేక విషయములలో 
    కల్తీ గురుంచి  వింటూనాము/చూస్తున్నాము  .  అవి  ముఖ్యముగా------
     పసిడి కల్తీ  -- పంట కల్తీ 
     బియ్యము కల్తీ -- పప్పులు కల్తీ 
     నూనెలు కల్తీ -- కారము కల్తీ 
     కూరలు కల్తీ -- పండ్లు కల్తీ 
     ఆసుపత్రిలు కల్తీ -- వైద్యము. మందులు కల్తీ 
     పాలు కల్తీ -- నీళ్ళు  కల్తీ.   గాలి కల్తీ 
     పెట్రోలు  కల్తీ --- కిరసనాయలు కల్తీ 
      విత్తనములు  కల్తీ-- విత్తము కల్తీ 
      రోడ్లు  కల్తీ  -- కట్టడములు కల్తీ 
      మనసు కల్తీ -- మనిషి కల్తీ 
ఇన్ని కల్తీలతో మనము రోజు గడుపుచున్నాము అంటే చాల విచారించదగ్గ విషయము. 
ఎప్పటికైనా ఈ కల్తీలనుంచి మనము విముక్తులము కాగాలమని ఆశిస్తూ--------
      

   

                           

                              

Friday 24 April 2015

Mamidi Pandu


                   మామిడిపండు

మామిడిపండు చూడ,  చూడ ముచ్చటగా నుండ
ముద్దు గుమ్మగా పసిడితో ముచ్చటగా పరవముగ ఉండ
నిన్ను తాకలేక  మరువలేక నీ రూపము చూసి
సంతోషము తో తృప్తినొంద,  నీ రసమాధుర్యము
ఎంతని  వర్ణింప తగునె, ఆ రసమస్వాదించు జింహకే  తెలుసు తెలుసు,
ప్రతి వేసవులు  ముగుయు  ముగుయు ఈ విధముగా...... 

Thursday 23 April 2015

Mandolin

                                  మాండొలిన్
నీవు మాండొలిన్  శ్రీనివాసుడువా లేక  సంగీత సరస్వతి కొండవా
నీవు లేని లోటు ఈ సంగీతప్రపంచానికి తీరని లోటు
నీ మాండొలిన్ మూగబోయే సంగీత ప్రపంచం  బోసిపోయే
నీవు తుంబర, నారద,  హనుమాన్ లలో ఐక్యము అయి
మోక్షము పొంది ఉండివచ్చు.
నీ ఉత్తమ సరస్వతి జన్మ ఈ ప్రపంచానికే సంతోషదాయకమై
నీవు సర్వదా ఈ సంగీత లోకమును అశీర్వదించగలవని .......

Monday 20 April 2015

Bharatavani

                         భారాతావని 

ఓ  భారతావని  భరతమాతవై  వెలసి 
నిండు   హృదయముతో నలు దిశల  నదులుగా  వెలసి 
సర్వ దేవతులను ఇచ్ఛి  సర్వ  శాస్త్రములను   భోదించి 
స్వఛమైన  దేశమును సర్వదా  ప్రసాదించి 
సుఖమైన జీవితము  గడుపమని  కోరిన  నీకు 
నిన్ను  సర్వదా కాపాడుట  మా  ధర్మమూ  గాద   ఓ  భారతావని . ... 

Akshya Truteeya

                    అక్షయ తృతీయ 

ఓ  అక్షయ  తృతీయ  బంగారు  తృతీయ 
ఈనాడు  బంగారు లేల  మన ఇంట   బంగారు భార్య లక్ష్మిలు  ఉండగా 
ఇంటింట  బంగారు నింపి  లక్ష్మి పుత్రులుగా  జేసి 
ప్రతి దినము లక్ష్మి తాండ  వించుచు  సర్వ జనులను 
చల్లగా  చూడు  తల్లి..... 




Saturday 11 April 2015

BUSY BUSY



                                                    బిజీ బిజీ


అసలే  ఆవిడ  బిజీ  బిజీ  -------
ఒకనాడు  బయటకి  వెళుతూ
--ఏమండోయ్  కొంచెం ఆ కూర కలగ తిప్పేయారు నేను
  కొంచెం  బయటకి వెళ్లి వస్తాను  -------
--మరల ఒకరోజు ఏమండోయ్  కొంచెం  ఆ  బాత్ రూమ్ లో బట్టలు  ఆరేసయ్యరు ---
--మరల ఒకరోజు బయటకి వెళ్ళుతూ .....
ఏమండోయ్ కొంచెం పిల్ల ఏడిస్తే ....పాలు పట్టరు ......
---- ఓసిని నేను ఆ పని చేయలేనే నావల్ల కాదు సుమీ !

ఓ మీ మట్టిబుర్ర --నేను చెప్పినది అక్కడ ఫ్రిడ్జి మీద ఉన్న పాలు
పిల్లకి పట్టించమని, అంతేగాని .....  మిమ్మల్ని .......... హా హా హా హా ....... 

Saturday 4 April 2015

PASIVEDANA

                           పసివేదన 
అమ్మా నా  జన్మ సఫలమయెనమ్మ 
నిండుగర్భమున తొమ్మిది నెలలు నన్ను దాల్చి 
నాకు జన్మ నిచ్చితివి  నిస్వార్ధముగా 
నన్ను,లాలించి, ప్రేమించి, పాలించి 
నాకు మార్గదర్సకమై నిలుచుచూ 
నన్ను ఒక జ్యోతిగా తీర్చి దిద్దవమ్మా.... 


TIRUMALA

                               తిరుమల 

తిరుమలేశుని  కోరిన  తీర్చు  కోర్కెలు  కోర్కెలు 
తీర్ధము  లెల్ల  తిరుమల  వైకుంఠమై 
తిరుమలయె  గాద  తిరు మ (మహా ) ల (లక్ష్మి) గా 
స్మరణయె  సదా  సదా  శుభము  శుభము లిచ్చు.... 

అన్నము

                                అన్నము     

పట్టెడు  పెట్టడు  పరమానందముతో 
పరవశించి  పరవశించే  పరమసంతోషముతో 
ఆ   పట్టెడు  అన్నము కొరకై  పరితపించి 
ఈ పొట్టను  చేతబట్టి  తిరిగె  దేశములెల్ల .... 

Wednesday 1 April 2015

Om Sai




స్వామి సదా నీ చరణములు గతియని నమ్మిడి  వారికీ
నీ అభయ హస్తము సర్వదా క్షేమము ప్రసాదించగా
నిన్ను మరువలేక నీకై  పరితపించుచు
జీవితము గడుపుటకన్న వేరే భాగ్యము కలదా ఓ సాయి.... 

Sangeeta kacheerelu

All time greats: The Music Trinity, Muthuswami Dikshitar, Saint Thyagaraja, and Shyama Sastrigal.                  సంగీత  కచేరీలు

సంగీత కచీరీలు ఇదివరలో  అనగా  ఒక  25-30 సం: వరకు,  అందరు  మహా  విద్వాంసులు. 
ఆరంభం  ఒక  మంచి  వర్ణముతో ప్రారంభం చేసి, తదుపరి ఒక పంచరత్న కీర్తనను ఆలపించి శ్రోతల మనస్సులను ఆకట్టు కొనువారు.  తరువాయి  భాగముగా  రెండు, మూడు పెద్ద రాగములను అనగా 
తోడి, కళ్యాణి, శంకరాభరణము, అభేరి, లాంటి వాటిలో వారు వారియొక్క విద్వత్తును చూ పించుచు 
.శ్రోతల మన్నలను పొందేడివారు.  అక్కడ మంచి కీర్తన, నెరవల్లు, మంచి పూర్తి స్వరము వేసి ... 
తన్యవర్తనమునకు అవకాశము ఉండెడిది. 

ఆ తరువాయి, కొన్ని అన్నమాచార్య కృతులు గాని, రామదాసు, సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలును 
గానముచేసి, తిల్లనాలు పాడి, అంతిమంగా మంగళం కీర్తనలను గానము చేసిడివారు. 
ఈ మొత్తము 5-6 గం. నడిచినవి.  ఇటువంటి కచీరీలు సంవత్సరమునకు ఒకసారి విన్నను 
వాటి జ్ఞాపకాలు ఎల్లటికి ఉండెడివి. 

ఈ రోజులలో ఆ బాణీ పూర్తిగా మారి చప్పచప్పగా  ఉండుట పరిపాటి 
అయినది.  కనుక ఆ పూర్వపు ఆచారము మరల మరల రావాలని 
ఆశిస్తూ.......... 

Lata

          లత
లేత వన్నెల  ఓ చిగురు లత
నీ నడుమ వంపులు చూడ మనసాయె
నిన్ను జేర తరము గాక
అందుకోను  ముందరకు  పడే.... 

Sunday 29 March 2015

Varalamma

                వారలమ్మ 

వచ్చెనమ్మ  సోమవారము  అందేనమ్మ   ఉదయ  కాఫీ 
జింహ  చాపల్యము  తీరే  మనసు  తృప్తి  చెందె 
మరల  ఎప్పుడు  దర్సనమమ్మ, ఏడు రోజులు  తరువాయ 
అంతవరుకు  నోరు  తెరచి  ఎదురు  చూడ  లేనమ్మ... 

Saturday 28 March 2015

SAMUDRUDU

                            సముద్రుడు 


ఉదయ   భానుడు   ఉద్భవించు   శుభ  ముచ్చటైన  సమయమున 
నిండైన  సముద్రుడు   ఎగసి  ఎగసి  పడిన  అలలతో 
చూడ  ముచ్చటతో  మనసు  పరవసించి  ముద్దాడ  కోరిక  కలగగా 
వద్దు  వద్దు అనుచు  ఎత్తైన  అలలు  భయపెట్టగా 
నిన్ను  తాకినంతనే  నిలువెల్లా  లవణమ యి  
అయినను  నీ  స్పర్స  సర్వదా పాప హరిణి  గాన 
నిన్ను  దర్శించు  భాగ్యము పొంది  ముక్తుడైతిని..... 

srirama navami

 శ్రీరామ  నవమి 

శ్రీరామ నవమి  ఓ  శుభ దినము వేళ 
సీతారాముల కళ్యాణము  లోకకళ్యాణము  గాద 
నిండు  గోదావరి ఒడ్డున 
వెలిసిన ఓ భద్రాద్రి రామ 
భద్రాద్రి వై భక్తులను భద్రముగా 
కాపాడు ఓ రామ రామ రామా 
నిన్ను సదా కొలుచు వారలకు 
సర్వదా కొంగు బంగారమ.... 

Monday 23 March 2015

VITTAM

                     

                          విత్తము 

               విత్తము  ఇచ్చు  సుఖము  విత్తము చేయు  దుఃఖము 
               విత్తము  కలిగించు  విపరీత  చేష్టలు 
               విత్తము  విశ్వమంతాగాని   విత్తమే  విశ్వముగాదు 
               విత్తము  పరమార్ధ  మెరిగి   మసులుకోర  జనులార.... 
          

Tuesday 17 March 2015

Panduga

               పండుగ 


వచ్చెనోయి  వచ్చెనోయి  ఉగాది  ఉగాది 
నూతనోత్సాహములతో నింపెనోయి  ఉగాది 
పిల్ల పాపల సందడి చేయు ఉగాది ఉగాది 
క్రొత్త క్రొత్త శోభ నింపు ఉగాది ఉగాది 
అందరని ఆనందములతో చూసే ఈ ఉగాది ఉగాది.... 



Tuesday 10 March 2015

Rupaam

                  రూపము 

త్రిగుణాకార అయిన  ఓ  బ్రహ్మ  స్వరూప 
సృష్టి కార్యమును చేపట్టి లోకము ఏర్పరచి 
మాంస ముద్దలను అనంత జీవ కోటిగా చేసి  
రూపములను ఇచ్చినావు ముచ్చటగా 
ఆ అందమంతా నింపినావు చర్మ సౌందర్యముతో 
ఎన్ని అందముల రూపములు దాచినావు తెలియదే ఈ జగతికి 
నీ వంటి శిల్పి వేరొకరు గలరా ఓ బ్రహ్మ 
సర్వదా నీకు ప్రణామంబులు ప్రణామంబులు.... 

Monday 9 March 2015

Ghantasala

         ఘంటసాల 

ఇంటి ఇంటికి గంట గంటకు మ్రోగే ఓ ఘంటసాల గానమా 
అది నీ స్వర గానమా లేక ఘంటా గానమా  
నీకు లేరు సాటి ఆ మధుర సింహ స్వరమునకు 
ఆ అమర గానము అజరామృతము  అయి 
నిత్యము నిలుచుచు మ్రోగును నలుదిశ లును దేశములందు 
ఈ శతాబ్దమునకు నిలిచే ఒక సింహ నాదముగా.... 

Saturday 7 March 2015

Jeevitam

          జీవితం 

సజ్జన సాంగత్యము విలువ తెలియలేక 
దుర్జన సాంగత్యము పొందె  దురహంకారముతో 
నిర్మల జీవితము నిష్పలముగా జేసి 
నిండు జీవితమును నిరుపముగా గడిపె .... 

Thursday 5 March 2015

Holi

                   హొలీ 

హొలీ  రంగు రంగుల  రంగోలి 
హొలు సేల్ గా నింపి నావు రంగులతో 
ఈ జనులను దేశమంతా 
అందరిని జేర్చినావు ఒక దారికి సంతోషములతో 
సర్వదా నిలుపు వమ్మ హొలీ, అంతా ఒకటే నని. 

Sangeeta saraswatulu

      సంగీత సరస్వతులు 

     శ్రీయుత 
1. పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారు 
2.  మహావాది వెంకటప్పయ్యగారు 
3.  చెంబై వైద్యనాథ భాగవతారుగారు 
4.  శీర్కలు గోవిందరాజన్ గారు 
5.  శంభంకూడి శ్రీనివాసు అయ్యంగారు 
6.  మదురై మణి గారు 
7.  మదురై సోమసుందరం గారు 
8.  ఉప్పలపాటి అంకయ్య  గారు 
9.  ఇమిటేషన్ఆ  చారి గారు 
10. శ్రీమతి  యం. ఎస్. సుబ్బలక్ష్మి గారు 
11. శ్రీమతి  యం. ఎల్. వసంత కుమారి గారు 
12. శ్రీమతి వసంత కోకిల గారు 
13. డాక్టర్ యం. బాలమురళీకృష్ణ గారు 
14. టి.ర్. సుబ్రహ్మణ్యం  గారు 
15. నేదునూరి కృష్ణమూర్తి గారు 
16. శ్రీమతి రాధా జయలక్ష్మి గారు 
17. టిఽర్. మహాలింగం  గారు 
18. రాజ రత్నం పిళ్ళై 
19. మాండొలిన్ యు. శ్రీనివాస్ 
20. ద్వారం వెంకట స్వామి నాయుడు గారు 
21. ద్వారం నరసింగ రావు నాయుడు గారు 
22. కున్నకుడి వైద్యనాధన్ 
23. శ్రీమతి గాయత్రి 
24. డి.కె. పట్టమాళ్ 
25.కదిరి గోపాలనాధ్ 

పైన  చెప్పినవి కొన్ని మచ్చు తునకలు. ఇవియే కాకా అనేక 
మంది మహా విద్వాంసులు ఈ కర్ణాటక సంగీతములో కలరు. వారి వారి బాణి, నడకలులలో 
ఎవరికీ వారె సాటి. 

ఈ  రోజు విద్యార్ధులు,విద్యార్ధినులు వారి నడకా విధానములు తెలుసికొని,గ్రహించి  మంచి విద్వాసంసులు 
కాగలరని ఆసిస్తూ ...... 

Tuesday 3 March 2015

DIABETIES

                తీపి  రోగం 


ఓ,  తీపి   నువ్వు   మధురముగా   మురిపింఛి   

నీ   నిజస్వరూపము దాల్చి   మధుమేహముగా 

పీడించు   పీడించు   సర్వ జనులను 

తప్పించు  అలవికాక  పరితపించుచు  జనులు 

మనసు  నిబ్బరము  జేసుకుని  జీవించు ఈ  జనులు.... 

Sunday 1 March 2015

Bhidiyam

               భిడియం 

శ్రీ   సతిని   చూడ   శ్రీ   వారు   సిగ్గు   పడచు 

ముసి ముసి  నవ్వులు   ముఖమున   రాలగా 

ముసలి ముసలి అమ్మలు   చిరు  చిరు నవ్వులతో మాయ మవ్వగా 

మరదళ్ళు  మతిపోయి  మూర్చ పోయె.... 

Thursday 26 February 2015

Mahalaxmi

       మహలక్ష్మి 

లక్ష్మి  నివాస  స్తానములు. 

1. మహాలక్ష్మి, పాదములందు  ఉన్నచో  ఐశ్వర్యములు  గలుగును . 
 2. పిక్కల (జంఘల) యందున్నచో  ధనవస్త్రాది  లాభము  గలుగును.
 3. గుహ్యస్తానమునందు  నున్నచో   మంచి  భార్య లేక మంచి భర్త  వచ్చును. 
 4. తొడలయందు ఉన్నచో సత్సంతాన భాగ్యము కలుగును. 
 5. హృదయము నందు ఉన్నచో  కోరిన  కోర్కెలు అన్నియు తీరును. 
 6. కంఠము నందుఉన్నచో కనకమణి భూషణాది సంపదలు కలుగును. 
 7. ముఖము నందు ఉన్నచో సకల విద్య పాండిత్యముతో పాటు కవితా  పటుత్వము కూడా కలుగును. 
 8. శిరస్సునం  దుండె నేని, సకల దారిద్రములను కలిగి, ఆయువు, భోగభాగ్యములు నశించును....  


Monday 23 February 2015

Telangana


           తెలంగాణ 

    తెలుగు  గానమై   తెలంగాణా   గా  వెలిసి 

    సంపదలన్నీ  నిల్పినావు   నీ   గర్భమున 

     దైవ  కృపతో   తీర్చి  దిద్ది  సర్వ  శాస్త్రములను  అందించినావు 

     నీ మేధా శక్తికి   కొదవు  లేదని   తెలిపిన  నీవు 

     కరుణించు  కరుణతో   సర్వదా   నీ  జనులను...... 

Andhra Pradesh

        ఆంధ్రప్రదేశ్ 

ఆంధ్రప్రదేశ్  ఆనంద  నిలయమై 

అన్నపూర్ణగా  పేరుగాంచి  అన్నము పెట్టి 

సర్వ దేవతులు  నిలిచి  శుభములిస్తూ 

వర్ధిల్లు   వర్ధిల్లు   దిన దినాభి  వృధిగా.... 

Saturday 21 February 2015

Telugu Bhasha

            తెలుగు భాష 

తెలుగు  వాడిగా పుట్టి  తెలుగు  దేశమున  పెరిగి 

తెలివి తేటలు  పొంది    తెలుగు  తేజ మనుచు 

తెలుగు  కవులతో  తెలుగు  గల  గల మనుచు 

దేశ  భాష లందు  తెలుగు లెస్స అనిపించి 

తెలుగు నిండిన ఈ  భూమికి  సదా తెలుగు గర్వము కాదా .... 

Friday 20 February 2015

Nidra

   నిద్ర 

అసలే  ఒక  వారము  Tour లో  అలసి  సొలసి  ఇంటికి 
నిన్న  రాత్రి   వచ్చానా ..... 
ఊదయమునే లేచి  హడావడిగా  ఆఫీసుకు   వస్తే 
   బాస్!

" ఏమయ్యా, నీ కళ్ళు వాచినట్లున్నాయి, నిద్ర పోలేదా "
 
--- ఏమి చెప్పమంటారు ... 
            
...  ఆఫీసులో మీరు   నిద్ర పోనివ్వరు ....
... ఇంట్లో ఆవిడ నిద్ర పోనివ్వదు .... 

                హా హా హా హా హా ......... 
 


Thursday 19 February 2015

Lancham

             లంచం 

ఓ  లంచావతరమా నీ రూపమేమని వర్ణింతును 
నీవు ఇందుగల అందులేవని తెలిపి 
ఎందెందు వెతికినా అందందే ప్రత్యక్షమై 
భారతావని ఆశ్ర ఇస్తూ మమ్ములను ఇక పీడింపక 
ఇక నీ అవతారములు చాలించి 

మమ్ములను  స్వేశ్చతో కాపాడి కరుణించు వమ్మ.... 


Bhimavaram

          భీమవరం 


ఓ  భీమేశ్వర, సోమేస్వరములతో వెలసిన భీమవరం మా 
సరస్వతీ తల్లిగా నిలచిన పట్టణమా 
రత్నములుగా తీర్చి దిద్ది న   నీ బిడ్డలు 
విశ్వ   ఖ్యాంతి నొంది వేలుగుచుండే ఈ ప్రపంచమున.... 

Monday 16 February 2015

stuti

                   స్తుతి

ఓ  జ్ఞాన సరస్వతి  జ్ఞానము  నిచ్చి

నాలుగు వేదములులను  నాలుకపై  నిల్పి

నలు దిశలు నడియాడుచు నరులను నడిపించు

నర జన్మ  సార్ధకముగా చేయు తల్లి....


Thursday 12 February 2015

Nijamu

           నిజము
మంచి నీటి కుండ  మంచి శోభ నిచ్చు
కుళ్ళు నీటి కుండ కుళ్ళు వాసన నిచ్చు
ఈ దేహ కుండ ఏ  వాసనా ఇచ్చునో
దేముని ఒక్కడికే తెలుసు నిజము నిజము... 

Margam

         మార్గము
స రి గ మ ప ద ని స   సప్త స్వరములై
సాధనతో  హాయ్ హాయ్ అనుపించు
వినులవారికి వీన విందులు చేయుచు
సజ్జనులకు మోక్ష మార్గము చూపుచు
తరింపరే ఓ   జీవులార...... 

Wednesday 11 February 2015

Siva

శివ

ఓం  శివ శంకర  అభిషేక ప్రియ
వేద వేద గాన  సంతోష ప్రియ
వాద్య తాళ  నాద నాట్య ప్రియ
 సదా నీ  సేవయే మాకు శ్రీ  రామ  రక్ష...

Adarsam

ఆదర్శం 

శ్రీరాముని చెంత జేరి  సీతమ్మగా  వెలిసి 
సూర్య వంశమునకు వన్నె  తెచ్చే 
యుగ యుగములకు నిల్చె ఆదర్శ జంటగా 
కోరినంతనే కోర్కెలు తీర్చే సీతమ్మ తల్లి..... 

Monday 9 February 2015

kshemam

        క్షేమం 

చదువులెన్ని  ఉన్న, చతురత  ఎంతవున్న 
సంపదలెంత ఉన్న   సంస్కార హీనులైనచో 
సంఘద్రోహి గాని  సంఘ మిత్రుడు అగున
మానవ క్షేమమే  దేశ క్షేమము గాద. 

BHRAMA

 

              భ్రమ 


   ఉదయమునే  లేచి   ఉపవాసమని  భ్రమించి
    పట్లు సడ లుచుండ  ఫలహారములకై ఎగబడి
    పంచ ప్రాణములు   నిలుపు కొనుచు, హాయ్ అని
     మో క్ష  సాధనకై  మోముగా  ఎదురు చూసే.
 

    

jnapakalu

            జ్ఞాపకాలు

 అన్నా  నీ  ప్రేమను పంచితివి  చిన్ననాడు చిలిపి చేష్టలతో

 కనకదుర్గమ్మను జేరదీసి  మణి రత్నమును  అన్నపూర్ణను  పొందితివి

గురువుగా అవతార మెత్తి జ్ఞానమును  ప్రసాదించితివి

ఒడిదుడుకులను  పూర్ణ దృష్టితో  స్వీకరించి గడిపితివి స్వచమైన జీవితము

... మల్లెల వారి ఇంట పెద్ద సోమన్న గా పేరుపొంది మిగిల్చితివి

సదా  జ్ఞాపకములు అందరికి . ....

Friday 30 January 2015

, Seva,

     

         Seva
రామా   నిన్ను  ఏల పూజింతురా
బాల్యమంతా బలపములతో గడిచే
కౌమారము   కామర్ధములతో  నిండే
వృద్దాప్యము అంతా వృధా అవుచుండే
ఏలా  పూజింతురా రామా నిన్ను ఎలా  పూజింతుర ...