Friday 27 December 2019

                                                  రాజధాని

అలనాడు ఒక ఆంధ్రప్రదేశ్ అయితే
మరునాడు రెండు ప్రదేశాలు అయ్యే
మరి  ఈనాడు ,  ముగ్గురు అయ్యే
ఏనాటిక   యెన్ని  పిల్లలు అవునో
ఎవరి ఎవరికీ  తెలియదు అమరేశ్వరా
కాపాడవయ్యా ఓ అమరేశ్వర కరుణతో .... 

Wednesday 25 December 2019

                                              మార్గశిరం

మార్గశిర మాసము  మార్గముచూపే
ధనుర్మాసమై  ధర్మము చెప్పే
శివ గోవిందులు చల్లగా చూడగా
ముక్తి నొసగురి   నరులకు నిజముగా ..... 

Thursday 12 December 2019

                                                   గొల్లపూడి 

విజయనగరంమున పుట్టి, విశ్వమంత  ఎదిగి 
గొల్ల గొల్లలు తిరిగి,  జల్లెడపట్టే,
తెలుగు సాహిత్యమును శోధించి  ఔపాసనపట్టె 
నటన నాట్యమందు నలుగురిలో భేషమని నిలిచి 
సినీరంగమున  పేరు ప్రఖ్యాతులు గాంచినావు 
ఓ గో ||  మారుతి,  నిజమైన మారుతివి  మీరు ఓ మానవ.... 
                                                    ఉల్లి ఘాటు

ఉల్లి ఘాటు పోయే , ఉన్నత స్థాయికి
ఉల్లి లోన చలువ,  ఎల్లమ్మకే తెలుసు
ఉల్లి చేయు మేలు,  ఎంతని  చెప్పగలమే
అందరికి అరచేతిలోకి రావే, నీ విశ్వరూపము చాలించి  ఓ ఉల్లి .... 

Monday 2 December 2019

                                               మానవ విలువలు

మనుషుడై పుట్టి , మనిషిగా పెరిగి,
మానవత్వములేని ఓ కర్కశ మనసా,
కరుణ దయా  లేక , కసాయి అయితివా,
అమ్మ, అమ్మల మాతృత్వము విలువ తెలిసి తెలిసి,
బ్రతకరా మానవ  ఈ  జన్మకి ...... 
                                  గ్రహణం
గ్రహణము పట్టే  నాడు, రధ చక్రములు ఆగే
చంద్ర గ్రహణం వీడే నేడు ,  రయ్యు రయ్యు మనే  నేడు
ఏమిమహిమో కాని, యాబది ఆరురోజలు ఏడిపించే ,
నేడు ఏమి దశో కానీ,  వరములు వర్షించే నాడు  ..... 

Tuesday 29 October 2019

                                     కార్తీక  మాసం

కార్తీక మాసము వచ్చే , కనులకు పండగ వచ్చే ,
 కార్తీక దీపం వెలిగే, మనలోని జ్యోతి వెలిగే,
శివ నామస్మరణములు మ్రోగె, నవనాడులు జలరించే భక్తితో ,
శివ కేశవులు దయతో,  మోక్ష మార్గము చూపె  ప్రాణికి   ......

Monday 28 October 2019

                     సంస్కృతం. 

సంస్కృతం నేర్పు, సదా చక్కటి  సంస్కృతి
సంస్కృతే కదా  మూలము చక్కటి సదాచారమునకు
అట్టి సదాచారము  ఇచ్చు  కీర్తి మానవాళికి
ఆ సంస్కృతం సంస్కృతే మానవులకు మేలుకొలుపు ..... .



Wednesday 4 September 2019


                          గురువు
గురువు నేర్పిన విద్య, గురు కటాక్షము పొందు
విద్య నొసుగు విధేయము, విజ్ఞానముతో
బుద్ధి నిచ్చు సదా బృహస్పతి సత్సంపన్నులకు
శ్రీ కృష్ణం వందే జగత్ గురువులు, ఈ జగతికి....

Wednesday 7 August 2019

.                             కాశ్మీర్

కాశ్మీరా  మా కనక  భూమి  దేవతా ,
మా చిర కాలపు  కలలు నెరవేర్చిన శిరోమణి ,
సదా మాకు బుద్ధి సిద్ధి ఇచ్చు శిరో సరస్వతీ నిలయమా ,
నీవు లేని లోటు మాకు నిత్య ఆవేదన కాదా ,
నీ చల్లని చూపులతో మా భారతావనిని ఆశీర్వదించు తల్లి ......

Sunday 4 August 2019

                                   శ్రావణం

శ్రావణ మాసము వచ్చే, శారదా గౌరీ పూజలందుకునే
శ్రావణితో శ్రావ్యముగా వేదఘోష  మారుమ్రోగే
శ్రావణ గౌరీ ముతైదువులతో ముచ్చటగా వీధి వీధులు  అలరించే
శ్రావణముతో  శుభ పండుగలకు  వేళ  వచ్చే  ........ 


Wednesday 31 July 2019

      గోదావరి
గోదావరి లేక గొల్లు గొల్లు మనే,
నిండు గోదావరిని చూసి గగ్గోలు పెట్టే
గోదావరి అమ్మ లేనిదే, అన్నము లేదురా,
సదా అమ్మ, అందరికీ ఆకలి తీర్చు మాతల్లి....

Tuesday 21 May 2019

                                                     వేసవి  సంబరం

వేసవి వచ్చే,  వేడి వేడి సెగలు తెచ్చే
క్రొత్త  ఆవ వచ్చే,  ఆవురు  ఆవురు  అనిపించే
మంచి పండు  వచ్చే, మధురములను ఇచ్చే
ఇదే కావచ్చు నిండు వేసవి రుచులు .......