Tuesday 20 December 2016

Dabbu Dabbu

                                       డబ్బు  డబ్బు 

బ్యాంకు  నిండా డబ్బు,  బ్యాగ్ లోనికి  రాకపోయే 
ఛెస్ట్  నిండా  డబ్బు ,  చేతికి  రాకపోయే 
నిన్ను చూడ ముచ్చటాయే,  ముట్టుకొనుట  చేతకాకపోయే 
అమ్మ లక్ష్మి కటాక్షమిచ్చే,  బందీఅయ్యే అద్దపుగోడలలో 
అమ్మ నిన్ను తాకలేని రోజు, రోజు గడవని రోజు 
కరుణించి కాపాడి,  నీ నిజ దర్శనమియ్యవమ్మా తల్లి  లక్ష్మీ ....... 

Wednesday 23 November 2016

Balamuralikrishna

                                     బాలమురళి

            సదా మంగళం, మంగళం, మంగళం అంటూ
            ఉదయించితివి  సప్తస్వరములలోన ఓ మురళీ
            కురిపించితివి అమృతవర్షము ఈ  లోకమునకు
            ఆరవ ఏట (6) మెరిసిన నీ గళము , నేటితో ముగిసినదా
            నీ  మృదు మధుర గానముతో లోలలాడించితివి
            నీ  గానము సదా ఈ  సూర్యకాంతిలో వెలుగు వెలుగు ఈ  ప్రపంచమున
            నీవు  లేని లోటు ఈ  సంగీత  ప్రపంచమునకు తీరని లోటు,
            ఇవే  మా  సప్తస్వరాంజలి   నీకు  సంగీత   భీష్మ .......
             

Wednesday 2 November 2016

Mukkupodi

                   ముక్కుపొడి 

ముక్కు పట్టు పట్టు ,    ముక్కుపొడి  పట్టు పట్టు 
ముక్కు పట్టు వీడ.  ముచ్చటగా ఉండు ఉండు. 
ముక్కు పొడి  పట్టులోన  హాయి ,  ఇంతని  ఏమని పొగడుదురా ,
ముక్కు శాస్త్రికే  తెలుసు ,  దీని సుఖఃము నరుడా ...... 
 

Tuesday 1 November 2016

Karteeka Masam

                కార్తీక  మాసము

కార్తీక మాసమున ,  కాకితో కబురు వచ్చే 
కనులారా   వీక్షించుటకు   కారణమయ్యే 
పెదఅమ్మవారి అయన .  చిన్నఅమ్మవారి అయన ఇల్లయిన . 
సోదలందరితో కలియు భాగ్యమేల 
అయ్యవారికి అభిషేకము .  అమ్మవారికి  పూజలందించు
భాగ్యమేమని తెలుప   భక్తులారా 
సహృదయముతో చేయు  సంస్కారములు 
సదా నిలుచు నిలుచు,  అందరి మదిలోన, మదిలోనా ........ 


 

Sunday 31 July 2016

Maata

                                మాట 

ఉన్నమాట  ఊసుఎత్తితే  వులిక్కిపడతారు 
విన్నమాట వివరిస్తే  విసుకొంటారు 
నోటిమాట నొక్కాణించితే  నివ్వరపోయారు 
మాటజారానేలా,  మోసము చేయనేల నరుడా ...... 

Saturday 30 July 2016

Andhra Hoda

                                          ఆంధ్ర హా దా 


ఆంధ్రుల హా దా.  అసలైన హాద. 
ఆంధ్రరాష్ట్ర  హాదా , అంతర్జాతీయ హాద ,
అనుభవించు ఈ హాద,  అమెరికా జేరు హాద,
అన్నము పెట్టు ఈ రాష్ట్ర హా దా, అన్యాయము చేయకు నీ వాద .... 

                                  

                                        

Santa

                         సంత           

చదువుల సంత ,  చక్కనైన సంత 
ఉద్యోగ సంత , నిత్య  భృతి  సంత 
ధర్మము ఎంతకాని , దరిరాని  వింత 
ధర్మమేల నిలుచునో, ధరణిలోన ......              

Tuesday 7 June 2016

Manasuu

                          మనస్సు 


ఏమీ  చేతురా  లింగా ,  ఏమీ  చేతురా  !
ఏమీ  చేతురా లింగా .  ఏమీ  చేతురా  । ।

ఉదయమున లేచి నీకు, ఉదకము సమర్పింతమన్న
ఉదయమునే , ఉదరము  ఉదకోష్ణము కోరే కోరే
ఉదకోష్ణము ఉరకులేసి  ఉరకులేసి ఉన్నదంతా ఊడిచి ఊడ్చే

ఎమీ చేతురా లింగా ....... ఎమీ చేతురా .....

మధ్యాహ్నము కాకపోయే, మధ్యకాలపు అన్నము కోరే
మధ్యాహ్నము కోర్కె తీర్చ, మనసు స్వాధీనము కాకపోయ

ఎమీ చేతురా లింగా ......  ఎమీ  చేతురా .....

సాయకాలము కాకాపోయె  సాయము కొరకు వేఛి చూడ
సాయకాలపు వేడినీళ్లు  సంతుస్టిగా ప్రాణము  లిచ్చె లిచ్చే

రాత్రి సమయము వచ్చే వచ్చే  అతి రుచులు పిలిచే పిలిచే
అన్ని రుచులును ఆరగింప,  ఆవింతలు ఆవహించే ,

ఎమీ చేతురా లింగా ...  ఎమీ చేతురా ......






Thursday 4 February 2016

Santosham

             సంతోషం 

ముచ్చటైన ముఖమునకు ముఖారవిందము  ముచ్చటగోల్ప
చిటపటలు  చిందులేయ,   చిరుకారు చిచ్చు పెట్టు 
జంట జంటల రుచి,  జిలేబి రుచి కావలె,
జీవిత మంతయు అనుభవింపరా నరుడా సంతసముగా ......       

Monday 1 February 2016

Kaasi

           కాశీ
కాశీ క్షేత్రమునకు కాలభైరవుడు కాపలకాయ
ఆత్మక్షేత్రమునకు  ఆత్మారాముడు కాపలా కాయ
పుణ్యక్షేత్రము ఫలము, ఏ పుణ్యకార్యము ఫలమిచ్చునో
మానవ జన్మకు మార్గము చూపవే ఓ మనసా..... 

Thursday 14 January 2016

Jeevitam

                జీవితం 

పనస పచ్చగా ఉండు, పండు తీయగా ఉండు 
మనిషి వెచ్చగా ఉండు, మనసు చల్లగా ఉండు 
అహము అధోలోకమునకు చేర్చు 
ఆప్యాతలు అమృతమును కురుపించు 
జీవితము సత్యము తెలుసుకోరా, సత్య సత్య ...... 

Wednesday 13 January 2016

Sankranti

                భోగి - 2016

భోగ భాగ్యములతో వెలిగీ ఓ భోగి 
సన్ క్రాంతిలతో వెలుగునిచ్చే సంక్రాంతి 
కనులకు సంతోషములతో  నింపే కనుమ 
దక్షిణాయము వెడలె,ఉత్తరాయణము పుణ్యకాలము వచ్చే 
ఇంటింటా కొత్త పంటలతో కళకళలాడే ఓ సంక్రాంతి 
అందరికి అదృష్టము నివ్వవే ఓ సంక్రాంతీ.....