Thursday 14 December 2017

.                                          దోమ
దోమ ఎంత యేని , కాటు, ఘూటుగాఉండు
దేహము ఎంత ఉన్న , మంట  అంపర మెక్కు ,
బరుకు  బరకలేక ,  బావురమని ఏడుపు వచ్చు
ఆ  దోమయే దొరికినంత, చచ్చు చచ్చు ఈ మానవ చేతులో .... 

Monday 11 December 2017

Janma

                                                             జన్మ 


 అమ్మ ప్రేమతో నా జన్మ నిచ్చినది
ఓ  అమ్మ ప్రేమతో నాతో  జీవితము  గడిపినది
ఓ  అమ్మ  నా జన్మ కడతీర్చనున్నది
ఏ  అమ్మ నా  జన్మకు  మోక్షం  ఇవ్వనున్నదో ....... 

Sunday 10 December 2017

                                                శ్రీ కృష్ణ

నల్లనైన వాడా , నవనీతమైన వాడా
గోవిందా పరుడా , గోపికల పరుడా
నరులకు భక్తి వసుడా ,  నారాయణ పరుడా
నీ నామమే కదా , మాకు రక్షా రక్షా .......


                                తెలుగు

 తెలుగు ఇంట  పుట్టె , కమ్మనైనా తెలుగు భాష
 తెలుగు సదా వెలిగే ,  ఎగిరే  ఆకాశమంత ఎత్తుకు
 తెలుగు భాషామృతము ,  ఆస్వాదించు తెలుగు బిడ్డా
 తెలుగు సభ లెల్ల , సదా నీ తెలుగును ఆదరించు  తెలుగు తేజ ....

Wednesday 15 November 2017


  అరుణాచల, అరుణాచల, అరుణాచల అరుణాచల ,
  అరుణాచల సాంబశివాయని , అరుణాచల సాంబశివాయని
  కరుణాచల సాంబశివాయని , తపించితిమి ,
  గిరి, గిరి , గిరి ,గిరియని ప్రదీక్షణము చేసితిమి  ,
  కరుణతో పాపములు హరించితివి,
  శ్రీ గిరి నిలయ , గిరివాసా , సదా మాకు మోక్ష దాయకా ......

                                సిరిపురం

  శ్రీ సిరిపురమున, శ్రీ లక్ష్మీ కటాక్ష మివ్వ ,
  నడిరోడ్డున  నల్లులు నరులకు నరకము చూపే
  దర్శనము కోరగా దళారులు దండుకొనగా
  దయతో అమ్మ ఆదరించి దర్శనము ఇవ్వ
  ప్రసాదించినది  ప్రసాదములు బహు రుచితో
  సంతసించితిరి భక్తులు సంతోషముతో ఆ భాగ్యమునకు ......
   

Thursday 2 November 2017

                                    అరుణా చల
అరుణా చల , కరుణా చలా
రమణా చల , రమణీయ చలా
గిరి రాజ తన , కైలాస గిరి వాసా
అరుణాచల శివ , సదా శంకర శివా ..... 

Thursday 19 October 2017

                                                          శారద 

శారద  శారదాంబుజ కటాక్ష వీక్షిణి 
సదా  వీణా పుస్తక ధారిణి కరకమలే 
వాగ్దేవీ ధారిణి  సదా పాలయమాం 
నీ దయకృపాతో,    తరింప చేయవే  ఓ శారదాంబా ..... 

Wednesday 18 October 2017

                                             శంభో శంకర 

శంభో శంకర సాంబసదా శివా,  శంభో శంకర, శంకరా 
పార్వతి తనయ శంకర,  పరమదయాకర శంకర 
కాలము నీదని , కలియుట మాదనితెలియకపోతిమి శంకరా 
శరణము ఇచ్చి , శాంతితో కాపాడవయ్యా శంకరా ..... // శంభో //

Monday 16 October 2017

                                                     దుర్గ 

దుర్గావిజయ దుర్గా , జయ దుర్గా 
ప్రసాదించితివి  ముగ్గురు  మూల పుటమ్ములను 
ఆరాధించితివి ప్రేమ ఆదరాభిమానములతో  
తీర్చి దిద్దితివి ఆకాశమంత ఎత్తునకు ,
సదా నీకొఱకై పరితపించితిరి అందరు,
నీసాంగత్యము సదా ఉగాది షడ్రుచులేగదా ఓ  దుర్గా 
మధురానుభూతులు మరవలేనివేకదా 
అలసి సొలసి నావని , నిష్క్రమించితివా  ఓ దుర్గా 
స్వర్గమున చేరి సదా సుఖములు పొందుగాక
నీ జ్ఞాపకాలే మధురానుభూతులై నీ వారికెప్పుడూ ఉండుగాక ...... 

Monday 18 September 2017

                                        సంగీత  సామ్రాట్టులు


సంగీత సామ్రాట్టులు స్వర్గమున సామ్రాజ్యము స్థాపించి
సంగీత  విహారం చేయ , నారద, తుంబురలు   సంతసించె,
త్రిమూర్తులు సంతసముతో  ఆలకించి ఆనంద పరవశులై .
అనుగ్రహముతో ఆస్థానలుగా వెలగమని   ఆ శీర్వదించే ....... 

4-9-2017 Vijaya Bhaskarudu

                              విజయ భాస్కరుడు

అలనాడు జన్మనెత్తె    పెద పట్టణమున విజయ  భాస్కరా,
తిరిగావు నాదని  పెద్ద పెద్ద పట్టణములన
అస్తమించితివి నేడు ఇసుక పట్టణమున
ఎగసి పోయే విష్ణు పట్టణమునకు ఈనాడు ........


సూర్యకాంతి వెదజల్లె విజయ భాస్కరుడు
మనః కాంతితో  మన్నలను పొందె  ఈ జగమున
అందరి మనసులను ఆ కొట్టకొనే    ప్రతిభతోన
ఆదర్శ జీవుఁడై అస్తమించే , విజయేశ్వరుడు ........

విజయ భాస్కరుడు ఉదయించె  నిట్టల  వంశమున
శోభిల్లే జగమంతా శిష్ఠగాను
అలరించే ,ఆదరించే  ఈ భూమండలమున
చాలు , చాలని, తరించె ఈ జన్మమునకు ........

వందనము, సరివందనము ,హరి వందనము , విజయ వందనము
నీ  ఝా0కార , భీకర , సింహ నాదమునకు వందన వందనములు
నీ చిరుగాన, ముద్దు పిలుపుల సొంపుకు , వందన వందనములు
నీకు నీవే మేధావి/సాటిలేరు విత్తమున
ఇవే మా  అందరి వందనములు, వందనములు ........






Monday 14 August 2017

SRI KRISHNA

                                    శ్రీ  కృష్ణ

నల్లనైన కృష్ణ ,  చిన్న నైన  కృష్ణ,
నలుగురితో ఆటలాడు ఓ కృష్ణ,  
నరులను తీర్చిదిద్దే  కృష్ణ,  

నిన్ను తలచినంతనే  , నీ నిజస్వరూపము చూపిన కృష్ణ 
సదా జపించనంతనే , సర్వ పాపములు మాపు కృష్ణ  
సదా మాకు రక్ష రక్ష , ఓ శ్రీకృష్ణ.........  

Friday 21 July 2017

RASA

                              రస  

రసంలోన , సారము ,రసమునే ఉండు ,
రస సారము మాధుర్యము రసజ్ఞులకే తెలుసు ,
రసము  విలువ ఇంతన ఏమని తెలుప గలము ,
రసాను భూతి పొందు రసజ్ఞుడా భువిలోనా ......  



Wednesday 14 June 2017

Attili Vijaya Chamundeswari

                                                 అత్తిలి విజయ చాముండేశ్వరి


అత్త్రి మహర్షి తపోఫలముతో అత్తిలి ఆయే
నేల రాలిన తాటకితో రేలంగి ఆయే
భీమేశ్వర , సోమేశ్వరులతో  భీమవరం ఆయే
విజయ తాండవముతో కరుణించి విజయ చాముండేశ్వరిగా
అత్తిలి(అత్రి) పట్టణములో వెలిసే వెలిసే
అమ్మ గోదావరి ఆశీస్సులే సదా ఉండు  అందరికీ ...... 

Saturday 20 May 2017

MALLELA

                                                       మల్లెల 

మల్లెల వారి ఇంట మా మంచి పేరు గాంచి 
వేంకటేశ్వరుడువై , శ్రీనివాసుడవై  సదా మ్రోగి ,
చిలిపి కృష్ణుడులు ,  చిన్ని కృష్ణలు ,  ముద్దు కృష్ణలువై,
సదా యశస్సును గాంచి  యశస్సులై , యశస్సుతో వర్ధిల్లే ......   

Thursday 4 May 2017

                                        విద్య  విద్య

విద్య విద్యయని వినయము చూపితివి
Assignments, Assignments అని ఎగబడితివి
పరీక్షలు కు  మాత్రం ,  పంగనామము పెట్టితివి
ఫలితములు చూడా, ఫక్కున  నవ్వు వచ్చే /తెచ్చే
చాలు చాలు ఇక లెమ్మని లేపే మనసు మనసు,
ముందు చూపుతో ముచ్చటగా నడవమని ముచ్చటించే ....... 

Saturday 11 February 2017

DR. RAMAM

                                 డాక్టరు   కాని   డాక్టర్

డాక్టరు  కాని  డాక్టర్ ,  Dr. Ramam
చదువుల  తల్లిని చంకనెక్కించుకొని
సరస్వతి తల్లిని తాంబూలముగా చేసుకొని
రసమును ఆస్వాదించితివా అవలీలగా
పండించితివయ్యా పట్టాల  పంట
నీ కృషి సదా   శ్లేఘనీయము, ఆదర్శము అందరికి ,
ఇవే మా శుభాభినందములు అందుకోవయ్యా DR.NSR MURTY.


Saturday 7 January 2017

Pub -Club

                              పబ్ --క్లబ్ 

పబ్ లందు -క్లబ్  లందు ఏమిగలదు , గబ్బు తప్ప ,
బార్ లందు ఏమి గలదు,   బారులు తీరిన బీర్ బాబులు తప్ప, 
శృంగారం మందు ఏమిగలదు , (శ్రుం) గారములేని శృంగభంగము  తప్ప ,
శుష్కించి,   శుష్కించి,  చివరకు  సున్నా మిగిలే......