రూపము
త్రిగుణాకార అయిన ఓ బ్రహ్మ స్వరూప
సృష్టి కార్యమును చేపట్టి లోకము ఏర్పరచి
మాంస ముద్దలను అనంత జీవ కోటిగా చేసి
రూపములను ఇచ్చినావు ముచ్చటగా
ఆ అందమంతా నింపినావు చర్మ సౌందర్యముతో
ఎన్ని అందముల రూపములు దాచినావు తెలియదే ఈ జగతికి
నీ వంటి శిల్పి వేరొకరు గలరా ఓ బ్రహ్మ
సర్వదా నీకు ప్రణామంబులు ప్రణామంబులు....
No comments:
Post a Comment