సంగీత కచేరీలు
సంగీత కచీరీలు ఇదివరలో అనగా ఒక 25-30 సం: వరకు, అందరు మహా విద్వాంసులు.
ఆరంభం ఒక మంచి వర్ణముతో ప్రారంభం చేసి, తదుపరి ఒక పంచరత్న కీర్తనను ఆలపించి శ్రోతల మనస్సులను ఆకట్టు కొనువారు. తరువాయి భాగముగా రెండు, మూడు పెద్ద రాగములను అనగా
తోడి, కళ్యాణి, శంకరాభరణము, అభేరి, లాంటి వాటిలో వారు వారియొక్క విద్వత్తును చూ పించుచు
.శ్రోతల మన్నలను పొందేడివారు. అక్కడ మంచి కీర్తన, నెరవల్లు, మంచి పూర్తి స్వరము వేసి ...
తన్యవర్తనమునకు అవకాశము ఉండెడిది.
ఆ తరువాయి, కొన్ని అన్నమాచార్య కృతులు గాని, రామదాసు, సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలును
గానముచేసి, తిల్లనాలు పాడి, అంతిమంగా మంగళం కీర్తనలను గానము చేసిడివారు.
ఈ మొత్తము 5-6 గం. నడిచినవి. ఇటువంటి కచీరీలు సంవత్సరమునకు ఒకసారి విన్నను
వాటి జ్ఞాపకాలు ఎల్లటికి ఉండెడివి.
ఈ రోజులలో ఆ బాణీ పూర్తిగా మారి చప్పచప్పగా ఉండుట పరిపాటి
అయినది. కనుక ఆ పూర్వపు ఆచారము మరల మరల రావాలని
ఆశిస్తూ..........
good information
ReplyDelete