Monday, 18 September 2017

                                        సంగీత  సామ్రాట్టులు


సంగీత సామ్రాట్టులు స్వర్గమున సామ్రాజ్యము స్థాపించి
సంగీత  విహారం చేయ , నారద, తుంబురలు   సంతసించె,
త్రిమూర్తులు సంతసముతో  ఆలకించి ఆనంద పరవశులై .
అనుగ్రహముతో ఆస్థానలుగా వెలగమని   ఆ శీర్వదించే ....... 

4-9-2017 Vijaya Bhaskarudu

                              విజయ భాస్కరుడు

అలనాడు జన్మనెత్తె    పెద పట్టణమున విజయ  భాస్కరా,
తిరిగావు నాదని  పెద్ద పెద్ద పట్టణములన
అస్తమించితివి నేడు ఇసుక పట్టణమున
ఎగసి పోయే విష్ణు పట్టణమునకు ఈనాడు ........


సూర్యకాంతి వెదజల్లె విజయ భాస్కరుడు
మనః కాంతితో  మన్నలను పొందె  ఈ జగమున
అందరి మనసులను ఆ కొట్టకొనే    ప్రతిభతోన
ఆదర్శ జీవుఁడై అస్తమించే , విజయేశ్వరుడు ........

విజయ భాస్కరుడు ఉదయించె  నిట్టల  వంశమున
శోభిల్లే జగమంతా శిష్ఠగాను
అలరించే ,ఆదరించే  ఈ భూమండలమున
చాలు , చాలని, తరించె ఈ జన్మమునకు ........

వందనము, సరివందనము ,హరి వందనము , విజయ వందనము
నీ  ఝా0కార , భీకర , సింహ నాదమునకు వందన వందనములు
నీ చిరుగాన, ముద్దు పిలుపుల సొంపుకు , వందన వందనములు
నీకు నీవే మేధావి/సాటిలేరు విత్తమున
ఇవే మా  అందరి వందనములు, వందనములు ........