మనస్సు
కనులకు కానరాని మనస్సు,
దోబూచు దోబూచు లాడుచు దోచుకొనుమనస్సు,
విరహ విహారముతో విహరించు వేధించు మనస్సు,
వీడును క్షణకాలములో వింతగాను....
గుండు గుండ్రముగా ఉండు గోకునకు,
పట్టుకుందామన్న రాదు, పట్టులేదు,
నిలవమన్నా లేదు నీరు నీరు,
ఇచ్చునయ్యా హాయ్, ఆ ప్రాణికి ప్రాణికీ....
శ్రీ కృష్ణుడు ఏమో కడు చిలిపిగా ఉండు,
శ్రీ రామయ్య సదా రమ్యముగా ఉండు,
శ్రీ విష్ణు సదా, విశ్వమంతా వ్యాపించు,
శ్రీ శివయ్య శిరస్సున నిలిచే ఈ జగమున....
నీ కను చూపులు, కలవరపెట్టే,
నీ మదిచూపులు, మనసును మైమరపించే,
నీ క్రీడా గిలిగింతలు, కలవర చేసే,
సదా నీ చల్లని చూపులు, మాపై చూపవయ్య, ఓ శ్రీ. కృష్ణా.....
అమ్మ అమృత మూర్తి గాద,
అమ్మ లేనిదే, ఈ ప్రపంచం ఎక్కడిది,
మన జన్మ రుణం, తర తరాల బంధం,
ఏమి చేసినా తీరదు ఈ ఋణాను బంధం,
మాతృ దేవతా సదా, మాతృ దేవో భవా కదా.....
మనసా
మనసు పలకరించే, తనువు పులకరించే,
మనసు మార్గము ఏమోగానీ, మానవునకు తెలియదు,
మనసు చంచలత్వము, బంధించుట మానవ సాధ్యమా,
మనసా ఏటులోర్తునే నా మనవి చేకొనవే, ... ఓ...
.
బుజ్జమ్మ
బుజ్జమ్మా బజ్జోరా బొజ్జమీద బొజ్జనిండ,
మునిపళ్ళతో గిలిగింతలు పెడుతూ, కనులతో సైగచేయుచు,
బుల్లి పాదములు నటన చేయుచుండ నా మనసు సంతసించే,
నీ కనుచూపులతో పలకరించే,నా హృదయం పల
వరించే....
ఓ బుజ్జమ్మా ఓ చిన్న బూజ్జమ్మ...