Wednesday, 23 November 2016

Balamuralikrishna

                                     బాలమురళి

            సదా మంగళం, మంగళం, మంగళం అంటూ
            ఉదయించితివి  సప్తస్వరములలోన ఓ మురళీ
            కురిపించితివి అమృతవర్షము ఈ  లోకమునకు
            ఆరవ ఏట (6) మెరిసిన నీ గళము , నేటితో ముగిసినదా
            నీ  మృదు మధుర గానముతో లోలలాడించితివి
            నీ  గానము సదా ఈ  సూర్యకాంతిలో వెలుగు వెలుగు ఈ  ప్రపంచమున
            నీవు  లేని లోటు ఈ  సంగీత  ప్రపంచమునకు తీరని లోటు,
            ఇవే  మా  సప్తస్వరాంజలి   నీకు  సంగీత   భీష్మ .......
             

Wednesday, 2 November 2016

Mukkupodi

                   ముక్కుపొడి 

ముక్కు పట్టు పట్టు ,    ముక్కుపొడి  పట్టు పట్టు 
ముక్కు పట్టు వీడ.  ముచ్చటగా ఉండు ఉండు. 
ముక్కు పొడి  పట్టులోన  హాయి ,  ఇంతని  ఏమని పొగడుదురా ,
ముక్కు శాస్త్రికే  తెలుసు ,  దీని సుఖఃము నరుడా ...... 
 

Tuesday, 1 November 2016

Karteeka Masam

                కార్తీక  మాసము

కార్తీక మాసమున ,  కాకితో కబురు వచ్చే 
కనులారా   వీక్షించుటకు   కారణమయ్యే 
పెదఅమ్మవారి అయన .  చిన్నఅమ్మవారి అయన ఇల్లయిన . 
సోదలందరితో కలియు భాగ్యమేల 
అయ్యవారికి అభిషేకము .  అమ్మవారికి  పూజలందించు
భాగ్యమేమని తెలుప   భక్తులారా 
సహృదయముతో చేయు  సంస్కారములు 
సదా నిలుచు నిలుచు,  అందరి మదిలోన, మదిలోనా ........